Header Banner

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

  Sat May 24, 2025 19:00        Politics

మహిళల సాధికారతకు ఏపీ ప్రభుత్వం మరో పథకంతో ముందుకొచ్చింది. ఫలితంగా ఆడవాళ్లకు ఇంటిదగ్గరే సంపాదించుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఈ అవకాశం దక్కబోతోంది.

 

ఏపీలోని మహిళలకు మరింత సాధికారత చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్వాక్రా మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిజిటల్ లక్ష్మి(Digital Lakshmi) పథకం తీసుకొస్తోంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలను డిజిటల్ లక్ష్మిలుగా నియమించబోతోంది. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడంతోపాటు, అదే స్థానంలో డ్వాక్రా మహిళలన్ని డిజిటల్ లక్ష్మిలుగా నియమించి అవే సేవలు అందించబోతోంది. ఇందుకోసం డిగ్రీ , ఆపై చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల్ని నియమించబోతోంది.

 

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా - 1000 పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..

 

డిజిటల్ లక్ష్మిగా నియమించబడిన డ్వాక్రా సంఘంలోని మహిళ.. డ్వాక్రా మహిళలతో పాటు, స్థానికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అప్లై చేయడంతోపాటు, ఇతర డిజిటల్‌ సేవల్ని(బిల్స్ పేమెంట్స్ వంటివి) అందించాల్సి ఉంటుంది. తమ ఇంటి ముందున్న చిన్న రూంలో ఈ కేంద్రం పెట్టుకుని మీ సేవా తరహాలో నిర్వహించుకోవచ్చు. దీనికోసం బ్యాంకు నుంచి రూ. 2 లక్షలు రుణం కూడా ఇస్తారు. డిజిటల్ లక్ష్మిగా పనిచేయడానికి ఎంతో కొంత కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై డ్వాక్రా సంఘాల మహిళలు, ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రుణాలు అందించడంతో పాటుగా చదువుకున్న మహిళల్ని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక చేయూతను అందించేలా చంద్రబాబు సర్కారు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం బాగుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 


ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #WorkFromHome #RemoteWork #EarnFromHome #OnlineJobs #HomeBasedBusiness